అన్నాడీఎంకేలో అత్యున్నత పదవి నాదే: కోర్టులో శశికళ పిటిషన్
- తమిళనాట ఆసక్తికరంగా మారిన రాజకీయాలు
- పళని, పన్నీర్ లపై శశికళ పిటిషన్
- తన కారుపై అన్నాడీఎంకే జెండాను పెట్టుకున్న శశికళ
జయలలిత మరణం తర్వాత పార్టీ పగ్గాలను శశకళ చేపట్టారు. సీఎం పదవిని చేపట్టేలోగానే అవినీతి కేసులో ఆమె జైలుకు వెళ్లారు. ఆ తర్వాత పళనిస్వామి సీఎం కావడం, పన్నీర్ సెల్వం డిప్యూటీ కావడం జరిగిపోయాయి. ఆ తర్వాత పార్టీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి శశికళను తొలగించారు. ఆ తర్వాత పార్టీ నుంచి పూర్తిగా బహిష్కరించారు. దీంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పార్టీలోని అత్యున్నత పదవి తనదేనని పిటిషన్ లో ఆమె పేర్కొన్నారు. మరోవైపు శశికళ కారుపై అన్నాడీఎంకే జెండా ఉండటం గమనార్హం.