తెలంగాణలో జన్మించిన కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ సతీశ్ శర్మ కన్నుమూత

  • గత రాత్రి గోవాలో కన్నుమూసిన నేత
  • 1947లో సికింద్రాబాద్‌లో జననం
  • రాజీవ్‌గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరు
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కెప్టెన్ సతీశ్ శర్మ గత రాత్రి గోవాలో కన్నుమూశారు. ఆయన వయసు 73  సంవత్సరాలు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న సతీశ్ శర్మ 11 అక్టోబరు 1947లో తెలంగాణలోని సికింద్రాబాద్‌లో జన్మించారు. అమేథీ, రాయ్‌బరేలీ నుంచి మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగానూ పనిచేశారు.

1993 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు కేబినెట్‌లో కేంద్రమంత్రిగా పనిచేశారు. సతీశ్‌శర్మకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఢిల్లీలో రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సతీశ్ మృతికి పలువురు నేతలు సంతాపం తెలిపారు.

Saitsh Sharma
Congress
Goa
Telangana

More Telugu News