ఇక్కడ పార్టీ పెట్టే బదులు.. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం పోరాడండి: షర్మిలకు గంగుల హితవు
- జగన్ కు షర్మిల మాత్రమే బాణం
- కేసీఆర్ కు కోట్లాది బాణాలు ఉన్నాయి
- టీఆర్ఎస్ ను ఎదుర్కోలేక అన్ని పార్టీలు ఏకమవుతున్నాయి
కేసీఆర్ ను, టీఆర్ఎస్ ను ఎదుర్కోలేక అన్ని పార్టీలు ఏకమవుతున్నాయని మండిపడ్డారు. షర్మిల ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం పోరాడాలని హితవు పలికారు. ప్రత్యేక రాయలసీమ ఏర్పడితే సీమవాసులు సంతోషంగా ఉంటారని... ఇక్కడ తాము కూడా సంతోషంగా ఉంటామని అన్నారు. టీఆర్ఎస్ కు ఏ పార్టీతో పొత్తు అవసరం లేదని... వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో సైతం టీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు.