ఈ ఫలితాలు మేం ఊహించినవే: సజ్జల
- ఏపీలో ముగిసిన తొలి, రెండో విడత పంచాయతీ ఎన్నికలు
- తమ అంచనాల మేరకు ఫలితాలు వచ్చాయన్న సజ్జల
- 80 శాతం వైసీపీ మద్దతుదారులే గెలిచారని వెల్లడి
- విజేతల ఫొటోలు వెబ్ సైట్లో ఉంచుతున్నామన్న సజ్జల
పంచాయతీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎన్నికల్లో హింస, దౌర్జన్యం ఎక్కడ జరిగిందో చంద్రబాబు చెప్పాలని నిలదీశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ప్రభావితం చేసేందుకే టీడీపీ ఆరోపణలు చేస్తోందని అన్నారు. వైఎస్సార్ డాట్ కామ్ వెబ్ సైట్ సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నారని సజ్జల ఆరోపించారు.