కీర్తి సురేశ్ ప్రేమ, పెళ్లి అంటూ జోరుగా కథనాలు...!
- అనిరుధ్ రవిచందర్ తో కీర్తి లవ్ లో ఉందంటూ కథనాలు
- త్వరలోనే పెళ్లి అంటూ ప్రచారం
- పెద్దల అంగీకారంతో ఒక్కటవనున్నారని ఊహాగానాలు
- ఆంగ్ల మీడియాలో కథనాలు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు
ఇటీవలే కీర్తి సురేశ్, అనిరుధ్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దాంతో వారిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ టాక్ వినిపిస్తోంది. త్వరలోనే వీరి పెళ్లి జరగొచ్చని, పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలు ఎక్కుతారని ఈ ఊహాగానాల సారాంశం. దీనికి సంబంధించి క్లారిటీ రావాలంటే అటు అనిరుధ్ కానీ, ఇటు కీర్తి కాని ప్రకటన చేయాల్సిందే. అప్పటివరకు ఈ కథనాలకు అడ్డుకట్ట పడకపోవచ్చు.