Rishabh Pant: మైదానంలో రిష‌భ్ పంత్, బెన్ స్టోక్స్ మ‌ధ్య వాగ్వివాదం.. వీడియో ఇదిగో

Rishabh Pant Ben Stokes involved in heated argument
  • చెన్నైలో జరుగుతున్న రెండో టెస్టులో  ఘ‌ట‌న‌
  • నిన్న  రిష‌భ్ పంత్ బ్యాటింగ్ చేస్తోన్న స‌మయంలో వాగ్వివాదం
  • కాసేపు ఆగిన మ్యాచ్‌
చెన్నైలో జరుగుతున్న రెండో టెస్టులో నిన్న‌ తొలి ఇన్నింగ్స్‌‌లో టీమిండియా బ్యాట్స్‌మ‌న్ రిష‌భ్ పంత్ బ్యాటింగ్ చేస్తోన్న స‌మయంలో ఆయ‌న‌కు ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ బెన్ స్టోక్స్ తో గొడ‌వ జరిగింది. మైదానంలోనే వారిద్ద‌రి మ‌ధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో కొన్ని క్ష‌ణాల పాటు మ్యాచ్ నిలిచిపోయింది. అంపైర్‌ కలుగజేసుకుని వివాదం పెర‌గ‌కుండా చేశారు.

టీమిండియా తొలి ఇన్నింగ్స్ 87వ ఓవ‌ర్ లో బ్యాటింగ్ చేస్తోన్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. పంత్ ను స్టోక్స్ ఏదో మాట అన‌డంతో తిరిగి బ్యాటింగ్ క్రీజులోకి వెళ్ల‌డానికి నిరాక‌రించిన పంత్ గొడ‌వ‌ప‌డ్డాడు. వారిద్దరు ఎందుకు వాగ్వివాదానికి దిగార‌న్న విష‌యం తెలియ‌రాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.  మైదానంలో స్టోక్స్ తీరుపై పంత్ అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు  తెలుస్తోంది.


Rishabh Pant
england
Cricket

More Telugu News