India: ఆట మొదలు కాగానే, రెండు వికెట్లు కోల్పోయిన ఇండియా!

Two Wickets down Early Chennai Test in Second Day
షార్ట్స్‌లో చూడండి
చెన్నైలో ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు తన ఆటను ప్రారంభించిన నిమిషాల వ్యవధిలోనే రెండు వికెట్లను కోల్పోయింది. నిన్న 88 ఓవర్ల పాటు ఆడి 6 వికెట్ల నష్టానికి 300 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నేడు బ్యాటింగ్ ను కొనసాగించిన ఇండియా, మరొక్క పరుగు జోడించి, అక్సర్ పటేల్, ఇషాంత్ శర్మ వికెట్లను కోల్పోయింది.

ఈ రెండు వికెట్లో మోయిన్ అలీకి లభించడం గమనార్హం. ఆపై తనతో పాటు చేరిన కుల్ దీప్ యాదవ్ తో కలిసి స్కోరును సాధ్యమైనంత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో రిషబ్ పంత్ ధాటిగా ఆడేలా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఓ 6ను కొట్టిన పంత్, తన వ్యక్తిగత స్కోరును 41 పరుగులకు తీసుకెళ్లాడు. ప్రస్తుతం భారత స్కోరు 91 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు.
Go Back to Shorts
India
England
Chennai
Test Match
Rishab Pant

More Telugu News