రాజన్న రాజ్యం అవసరం లేదు... రామరాజ్యం కావాలి: అరవింద్
- కొత్త పార్టీ పెడుతున్న షర్మిలకు శుభాకాంక్షలు తెలిపిన అరవింద్
- అయితే తెలంగాణ ప్రజలకు రాజన్న రాజ్యం అవసరం లేదని వ్యాఖ్య
- ఎన్నికల తర్వాత హామీలను మర్చిపోవడం కేసీఆర్ కు అలవాటేనని విమర్శ
ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై అరవింద్ విమర్శలు గుప్పించారు. నల్గొండ జిల్లా హాలియా సభలో ప్రసంగించిన కేసీఆర్... దివంగత ఎమ్మెల్యేకు కనీసం సంతాపాన్ని కూడా ప్రకటించలేదని మండిపడ్డారు. కేసీఆర్ అహంకార వైఖరికి ఇది నిదర్శనమని చెప్పారు. ఎన్నికలకు ముందు హామీలను ఇవ్వడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత వాటిని మర్చిపోవడం కేసీఆర్ కు అలవాటేనని చెప్పారు. గిరిజన మహిళల పట్ల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు.