పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన చిట్యాల సీఐ
- హన్మకొండ కేయూసీ సమీపంలో కారులోనే పురుగుల మందు తాగిన సీఐ
- గమనించి ఆసుపత్రిలో చేర్పించిన బ్లూకోల్ట్ పోలీసులు
- ఆర్థిక కష్టాలు, కుటుంబ సమస్యలే కారణమంటూ సూసైడ్ లేఖ
అదే సమయంలో సీఐకి ఫోన్ రావడంతో పోలీసులు మాట్లాడడంతో ఆయన చిట్యాల సీఐ అని తెలిసింది. దీంతో వెంటనే ఆయనను హన్మకొండలోని ఓ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సమస్యలు, ఆర్థిక కష్టాల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సీఐ రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ రమణ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. విషయం తెలిసిన భూపాలపల్లి జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ వెంటనే హన్మకొండ వచ్చి చికిత్స పొందుతున్న సీఐని పరామర్శించారు.