పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

  • ఆలయాలపై దాడులు చేయిస్తున్నది తానే అంటూ ప్రవీణ్ వీడియో
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
  • ప్రవీణ్ ను అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు
ఏపీలో ఆలయాలపై దాడులు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆలయాలపై దాడులు తానే చేయిస్తున్నానంటూ కాకినాడకు చెందిన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడిన వీడియో కలకలం రేపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చివరకు మంగళగిరి సైబర్ సీఐడీ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.

ఈ కేసులో ప్రవీణ్ చక్రవర్తికి గుంటూరు జిల్లా కోర్టు అడిషనల్ జడ్జి వాసంతి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. దేశం విడిచి వెళ్లకూడదని షరతు విధించారు. ప్రతి ఆదివారం సీఐడీ పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలని ఆదేశించారు. కేసు దర్యాప్తుకు సహకరించాలని ఆదేశిస్తూ బెయిల్ మంజూరు చేశారు.

Praveen Chakravarthi
Pastor
Bail

More Telugu News