ఫోన్ చేసి శశికళ ఆరోగ్యం గురించి ఆరా తీసిన రజనీకాంత్
- రజనీకాంత్ ఫోన్ చేశారని వెల్లడించిన దినకరన్
- ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడి
- సుదీర్ఘ ప్రయాణం చేసి అలసిపోయారని వ్యాఖ్య
ఈ విషయాన్ని శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ వెల్లడించారు. రజనీకాంత్ తమకు ఫోన్ చేశారని, చిన్నమ్మ ఆరోగ్యం గురించి ఆరా తీశారని చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రస్తుతం చిన్నమ్మ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. సుదీర్ఘ ప్రయాణం చేసి ఆమె అలసిపోయారని చెప్పారు. మరోవైపు శశికళకు రజనీ ఫోన్ చేయడంపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక రాజకీయ కోణం ఉందా? అనే చర్చ జరుగుతోంది.