ఏపీ పంచాయతీ పోల్స్.. మరికాసేపట్లో ప్రారంభం కానున్న తొలి విడత పోలింగ్
- 12 జిల్లాలలో తొలి విడత ఎన్నికలు
- సర్పంచ్ బరిలో 7,506, వార్డు బరిలో 43,601 మంది
- కరోనా సోకిన వారికి ప్రత్యేక సమయాలు
గుర్తుల కేటాయింపులో పొరపాట్ల కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని వడ్డిగూడెం, బొప్పనపల్లిలో వార్డు ఎన్నికలను రెండో దశకు వాయిదా వేశారు. మొత్తం 32,502 వార్డు సభ్యుల స్థానాల్లో 12,185 ఏకగ్రీవం అయ్యాయి. 160 స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. పోలింగ్ కోసం సర్వం సిద్ధం చేసిన అధికారులు కరోనా సోకిన వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారి కోసం ప్రత్యేక సమయాలు కేటాయించారు.