మహారాష్ట్ర బీజేపీ కార్యకర్తపై ఇంకు పోస్తూ దాడి.. వీడియో ఇదిగో!
- ఉద్ధవ్ థాకరేపై బీజేపీ కార్యకర్త విమర్శలు చేశాడని దాడి
- మహారాష్ట్రలోని సోలాపూర్ ప్రాంతంలో ఘటన
- శివసేన నేతలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతల డిమాండ్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై బీజేపీ కార్యకర్త విమర్శలు చేశాడనే కారణంతో ఈ దాడికి పాల్పడ్డారు. మహారాష్ట్రలోని సోలాపూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో మీడియా చేతికి చిక్కింది. దాడికి పాల్పడ్డ శివసేన నేతలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.