Samantha: ఇంత ప్రేమ నన్ను కష్టాల్లో పడేస్తోంది: సమంత

Samantha Insta Fallowers Reach 15 Millions
  • ఇన్ స్టాగ్రామ్ లో కోటిన్నరకు చేరిన ఫాలోవర్ల సంఖ్య
  • ఇక మరింతగా శ్రమించాల్సిందే
  • సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
ఇన్ ‌స్టాగ్రామ్ ‌లో అందాల నటి సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఆమె ఫాలోవర్ల సంఖ్య కోటిన్నర (15 మిలియన్లు)కు చేరింది. దీంతో తానెంతో బిజీగా షూటింగ్స్ లో ఉన్న వేళ, తన అభిమానుల సంఖ్య కోటిన్నరను చేరిందని తెలిసిందని, ఇంత ప్రేమ తనను మరింత కష్టపడేలా చేస్తోందని వ్యాఖ్యానించింది. అభిమానుల ప్రేమకు తన కృతజ్ఞతలని, వారు చూపించే ప్రేమ తనను మరింత శ్రమించేలా చేస్తోందని పేర్కొంది. సామాజిక మాధ్యమాల్లో సమంత ఎంతో యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.
Samantha
Instagram
Love
Fans
Fallowers

More Telugu News