ఉత్తరాఖండ్ లో ఆకస్మిక వరదలు... సొరంగంలో చిక్కుకున్న 16 మందిని కాపాడిన భద్రతా బలగాలు
- చమోలీ ప్రాంతంలో విరిగిపడిన కొండ చరియలు
- ధౌలిగంగా నదిలో హఠాత్తుగా పెరిగిన నీటిమట్టం
- దిగువన ఉన్న ప్రాంతాలు జలమయం
- తపోవన్ విద్యుత్ ప్రాజెక్టు నీట మునక
అయితే, ఐటీబీపీ సిబ్బంది ఎంతో శ్రమించి వారిని బయటికి తీశారు. కాగా, ఈ వరదల్లో 150 మంది వరకు గల్లంతైనట్టు భావిస్తున్నారు. ఇప్పటివరకు 10 మంది మృతదేహాలు వెలికితీసినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అటు, మృతుల కుటుంబాలకు ఉత్తరాఖండ్ సర్కారు రూ.4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించనుంది.