అవినీతి గురించి జగన్, విజయసాయిరెడ్డి మాట్లాడితే అవినీతే సిగ్గుతో తలదించుకుంటుంది: బుద్ధా వెంకన్న

  • జగన్, విజయసాయిపై బుద్ధా వ్యాఖ్యలు
  • అవినీతికి మానవ ప్రతిరూపాలు అని వెల్లడి
  • టీడీపీ అవినీతి చూపలేక చేతులెత్తేశారని విమర్శలు
  • వైసీపీ నేతలు ఎన్నికల నుంచి పారిపోతున్నారని ఎద్దేవా
టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వైసీపీ పెద్దలపై విరుచుకుపడ్డారు. 20 నెలల పాలనలో 20 పైసల అవినీతి కూడా చూపలేక చేతులెత్తేశారని వ్యాఖ్యానించారు. ఇంకా ఎంతకాలం చంద్రబాబు పాలనలో అవినీతి అంటూ కాలం గడిపేస్తావ్ విజయసాయిరెడ్డీ అంటూ మండిపడ్డారు. జగన్, విజయసాయి అవినీతికి మానవ రూపాలు అని, వారిద్దరూ అవినీతి గురించి మాట్లాడితే అవినీతే సిగ్గుతో తలదించుకుంటుందని పేర్కొన్నారు.

తుగ్లక్ పాలన చూసి పంచాయతీ ఎన్నికల్లో నిలబడడానికి వైసీపీ నాయకులు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో నిలబడితే చాలు... అక్రమ ఇసుక, మద్యం ద్వారా దోచుకున్న డబ్బు ఒక్కో అభ్యర్థికి రూ.50 లక్షలు ఇచ్చి, ఎన్నికల ఖర్చంతా భరిస్తాం అంటున్నా గానీ కొన్ని చోట్ల అభ్యర్థులు దొరకడంలేదని వ్యంగ్యం ప్రదర్శించారు. దాంతో, పార్టీలో చేరాలంటూ టీడీపీ నాయకులను కాళ్లావేళ్లా పడుతున్నారు కదా సాయిరెడ్డీ అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

Budda Venkanna
Jagan
Vijay Sai Reddy
Chandrababu
Telugudesam

More Telugu News