ఆదిలోనే టీమిండియాకు ఎదురుదెబ్బ‌.. ఇద్ద‌రు ఓపెన‌ర్లూ ఔట్‌!

team india openers out
షార్ట్స్‌లో చూడండి
చెన్నైలో భార‌త్-ఇంగ్లండ్ మ‌ధ్య జ‌రుగుతోన్న తొలి టెస్టు మూడో రోజు ఆట‌లో  ఓవ‌ర్ నైట్ స్కోరు కు మ‌రో 23 ప‌రుగులు జోడించిన ఇంగ్లండ్ 578 ప‌రుగుల‌కు ఆలౌటైన విష‌యం తెలిసిందే. అనంత‌రం బ్యాటింగ్ ప్రారంభించిన భార‌త్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ‌లు తగిలాయి. 44 ప‌రుగుల‌కే టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది.

ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ 6 ప‌రుగుల‌కే అర్చ‌ర్ బౌలింగ్‌లో కీప‌ర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. శుభ్‌మ‌న్ గిల్ 29 ప‌రుగులు చేశాక అర్చ‌ర్ బౌలింగ్‌లోనే అండ‌ర్స‌న్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్ర‌స్తుతం క్రీజులో పుజారా(20), కోహ్లీ(4) ఉన్నారు. అతి త‌క్కువ ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోవ‌డంతో భార‌త బ్యాట్స్‌మెన్ పై ఒత్తిడి ప‌డుతోంది.  భోజన విరామం సమయానికి టీమిండియా స్కోరు‌ 59/2గా ఉంది.
Go Back to Shorts
Team India
england
chennai
test

More Telugu News