Ahmedabad: నరేంద్ర మోదీ సోదరుడి కుమార్తెకు టికెట్ నిరాకరించిన బీజేపీ!

No Ticket for Narendra Modi Brothers Daughter in Ahmadabad Corporation Elections
  • అహ్మదాబాద్ కార్పొరేషన్ కు ఎన్నికలు
  • పోటీ చేయాలని భావించిన ప్రహ్లాద్ మోదీ కుమార్తె సోనాల్
  • నేతల బంధువులకు టికెట్లను ఇవ్వకూడదన్న అధిష్ఠానం 
గుజరాత్ లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ పడాలని భావించిన ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడి కుమార్తెకు చుక్కెదురైంది. ప్రధాని సోదరుడు ప్రహ్లాద్ మోదీ కుమార్తె సోనాల్ మోదీకి టికెట్ ను నిరాకరించినట్టు రాష్ట్ర బీజేపీ నేతలు ప్రకటించారు. పార్టీ నేతల బంధువులకు టికెట్లు ఇవ్వకూడదని అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు ఆర్సీ పాటిల్ స్పష్టం చేశారు.

కాగా, అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పై కన్నేసిన సోనాల్ మోదీ, బోదక్ దేవ్ వార్డు నుంచి పోటీ చేయాలని భావించారు. ఈ మేరకు దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు బీజేపీ తరఫున కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే వారి పేర్లను పార్టీ ప్రకటించింది. ఆ జాబితాలో సోనాల్ పేరు లేకపోవడం గమనార్హం.
Ahmedabad
Sonal Modi
BJP
Narendra Modi
Local Body Polls

More Telugu News