Bellamkonda Srinivas: ముంబైకి మకాం మార్చిన టాలీవుడ్ యంగ్ హీరో

Bellamkonda Srinivas shifts to Mumbai
  • మాస్ హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ 
  • 'ఛత్రపతి' రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ
  • వీవీ వినాయక్ దర్శకత్వంలో రీమేక్
  • జుహు ప్రాంతంలో తీసుకున్న ఫ్లాట్  
ప్రముఖ నిర్మాత తనయుడిగా హీరోగా చిత్ర రంగ ప్రవేశం చేసినా.. తన స్వయం కృషితో .. ప్రతిభతో అనతికాలంలోనే మాస్ హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ పేరుతెచ్చుకున్నాడు.  ఫటఫటా టాప్ డైరెక్టర్లతో భారీ  సినిమాలు చేసేస్తూ.. హీరోగా తన గ్రాఫ్ పెంచుకుంటున్నాడు.

ఇటీవలే 'అల్లుడు అదుర్స్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యువ కథానాయకుడు ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తున్నాడు. తెలుగులో సూపర్ హిట్టయిన ప్రభాస్ సినిమా 'ఛత్రపతి'ని హిందీలో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి.

ఈ క్రమంలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా ముంబైకి షిఫ్ట్ అయ్యాడు. అక్కడి ఖరీదైన జుహు ప్రాంతంలో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకున్నట్టు తెలుస్తోంది. తన తొలి హిందీ సినిమా షూటింగ్ పూర్తయ్యేంత వరకు శ్రీనివాస్ అక్కడే మకాం ఉంటాడని అంటున్నారు.

అంతేకాదు, 'ఛత్రపతి' రీమేక్ తర్వాత బాలీవుడ్ లో మరిన్ని సినిమాలు చేయాలని ఆయన ప్లాన్ చేసుకుంటున్నాడట. అందుకే, అక్కడ ఫ్లాట్ తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి, మన టాలీవుడ్ హీరో బాలీవుడ్ లో కూడా సక్సెస్ అవుతాడేమో చూద్దాం!
Bellamkonda Srinivas
VV Vinayak
Chatrapati
Bollywood

More Telugu News