Pawan Kalyan: నిర్మాత ఏఎం రత్నంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్

Pawan Kalyan conveys birthday wishes to Producer AM Ratnam
  • క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న పవన్
  • ఏఎం రత్నం నిర్మాణంలో చిత్రం
  • నేడు ఏఎం రత్నం పుట్టినరోజు
  • సెట్స్ పై పుష్పగుచ్ఛం అందించిన పవన్
ఇటీవల వరుసగా సినిమాలు అంగీకరిస్తున్న పవన్ కల్యాణ్ తాజాగా క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఏఎం రత్నం నిర్మాత. కాగా, నేడు ఏఎం రత్నం పుట్టినరోజు కావడంతో ఆయనపై శుభాకాంక్షల జల్లు కురుస్తోంది. తన నిర్మాత ఏఎం రత్నంకు పవన్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. సెట్స్ పై ఆయనకు పుష్పగుచ్ఛం అందించారు. పవన్ నటిస్తున్న ఈ చిత్రానికి 'హరిహర వీరమల్లు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

కాగా, షూటింగ్ లో ఉన్న పవన్ కల్యాణ్ ను జనసేన పార్టీ గోదావరి జిల్లా సమన్వయ కమిటీ సభ్యుడు డాక్టర్ యిర్రింకి సూర్యారావు కలిశారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల తాజా రాజకీయ పరిణామాలను జనసేనానికి వివరించారు. ఈ సమావేశంలో నిర్మాత ఏఎం రత్నం కూడా పాల్గొన్నారు.
Pawan Kalyan
AM Ratnam
Birthday
Harihara Veeramallu
Janasena
Tollywood

More Telugu News