Guntur District: గుంటూరు కలెక్టర్ గా వివేక్ యాదవ్ నియామకం

Vivek Yadav appointed as Gutur Collector
షార్ట్స్‌లో చూడండి
గుంటూరు జిల్లా కొత్త కలెక్టర్ గా వివేక్ యాదవ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెక్రటరీగా పని చేస్తున్నారు. అంతకు ముందు గుంటూరు జిల్లా కలెక్టర్ గా బసంత్ కుమార్ పేరును ఎస్ఈసీ ప్రతిపాదించింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ప్యానల్ లో మరొకరైన వివేక్ యాదవ్ పై ఎస్ఈసీ మొగ్గు చూపింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా కలెక్టర్ గా వివేక్ యాదవ్ ను నియమించేందుకు జీఏడీలో కార్యాచరణ జరుగుతోంది. కాసేపట్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
Go Back to Shorts
Guntur District
Collector
Vivek Yadav

More Telugu News