ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను పొడిగించిన ఏపీ ప్రభుత్వం
- ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ ఆదిత్యనాథ్
- కేసు నమోదు చేసి దర్యాప్తునకు ఏసీబీకి అనుమతి ఇచ్చామన్న ప్రభుత్వం
- నిన్నటి నుంచి పొడిగింపు అమల్లోకి..
వెంకటేశ్వరరావుపై అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ డైరెక్టర్ జనరల్ ప్రభుత్వాన్ని కోరగా, గత నెల 19న ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ నిన్న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్ను మరో ఆరు నెలలపాటు కొనసాగించాలని సమీక్ష కమిటీ చేసిన సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.