ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను పొడిగించిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రస్తుతం ఉన్న సస్పెన్షన్‌ను మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమీక్ష కమిటీ సిఫార్సు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని, నిన్నటి నుంచే ఈ పొడిగింపు అమల్లోకి వస్తుందని తెలిపింది.

వెంకటేశ్వరరావుపై అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ డైరెక్టర్ జనరల్‌ ప్రభుత్వాన్ని కోరగా, గత నెల 19న ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ నిన్న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్‌ను మరో ఆరు నెలలపాటు కొనసాగించాలని సమీక్ష కమిటీ చేసిన సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.

AB Venkateswara Rao
Andhra Pradesh
IPS
suspension

More Telugu News