Dipak Haldar: తృణమూల్ కు గుడ్ బై చెప్పిన మరో ఎమ్మెల్యే... కాసేపటికే బీజేపీలో చేరిక

Dipak Haldar quits TMC and later joined BJP
  • టీఎంసీ నుంచి బీజేపీలోకి కొనసాగుతున్న వలసలు
  • తృణమూల్ కు దీపక్ హల్దార్ రాజీనామా
  • తనను పనిచేయనివ్వడంలేదని టీఎంసీపై ఆరోపణ
  • అతడికి తాము టికెట్ ఇవ్వబోవడంలేదన్న టీఎంసీ
  • అందుకే ముందే వెళ్లిపోయాడని వెల్లడి

మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ నుంచి మరో ఎమ్మెల్యే తప్పుకున్నాడు. డైమండ్ హార్బర్ శాసనసభ్యుడు దీపక్ హల్దార్ టీఎంసీ పార్టీకి గుడ్ బై చెప్పారు. నియోజకవర్గంలో పని చేసేందుకు తనను అనుమతించడంలేదని హల్దార్ రాజీనామా సందర్భంగా వ్యాఖ్యానించారు. టీఎంసీ నుంచి వైదొలగిన కాసేపటికే హల్దార్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు. 24 పరగణాల జిల్లాలోని బరూయ్ పూర్ లో జరిగిన ఓ సభలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.

హల్దార్ రాజీనామాపై టీఎంసీ వర్గాలు స్పందించాయి. అతడు వెళ్లిపోయినందువల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదని వెల్లడించాయి. పైగా, అతడికి రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ టికెట్ ఇవ్వాలనుకోలేదని, టీఎంసీ టికెట్ ఇవ్వదన్న విషయం తెలిసే అతడు పార్టీ నుంచి వెళ్లిపోయాడని ఆ వర్గాలు వివరించాయి. ఓ ఎమ్మెల్యేగా హల్దార్ ఆశించిన రీతిలో పనిచేయడంలేదని ఆరోపించాయి.

  • Loading...

More Telugu News