భారత్ నుంచి దక్షిణాఫ్రికా చేరుకున్న 10 లక్షల కరోనా టీకాలు
- ఆఫ్రికా ఖండంలో అత్యధిక కేసులు, మరణాలు ఇక్కడే
- ఈ నెలలోనే మరో 5 లక్షల డోసులు
- భారత్ నుంచి టీకాలు అందాయన్న అధ్యక్షుడు రామఫోసా
ఈ సందర్భంగా అధ్యక్షుడు రామఫోసా మాట్లాడుతూ.. భారత్ నుంచి తమ దేశానికి తొలి దశ కరోనా టీకాలు అందినట్టు చెప్పారు. ఈ నెలలోనే మరో 5 లక్షల డోసులు దక్షిణాఫ్రికాకు చేరుకోనున్నాయి. ఆఫ్రికా ఖండంలో అత్యధిక కేసులు, మరణాలు దక్షిణాఫ్రికాలోనే నమోదయ్యాయి. ఇక్కడ 1.4 మిలియన్ల కేసులు నమోదు కాగా, 44 వేల మరణాలు సంభవించాయి. అంతేకాదు, గతేడాది ఇక్కడ ‘501Y.V2’ అనే మరో ప్రమాదకర కరోనా వైరస్ వేరియంట్ కూడా బయటపడింది. ఆ తర్వాత యూరప్, అమెరికా, ఆసియాలోనూ ఈ రకం వైరస్‌ను గుర్తించారు.