Khammam: టీలో మత్తు పదార్థం కలిపి పనిమనిషిపై అత్యాచారం.. వీడియో చిత్రీకరణ

House maid reaped in Khammam
  • ఈ నెల 13న చోటుచేసుకున్న దారుణం
  • అత్యాచారాన్ని వీడియో తీసిన యజమానురాలు
  • గతంలో కూడా ఓ వ్యాపారిని ట్రాప్ చేసిన యజమానురాలు
ఖమ్మం నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంటికి వచ్చిన బంధువులు ఆ ఇంట్లో పని చేస్తున్న పనిమనిషిపై అత్యాచారం చేశారు. వివరాల్లోకి వెళితే, నగరంలోని టీచర్స్ కాలనీకి చెందిన ఓ మహిళ ఇంట్లో ఒకామె పని చేస్తోంది. ఈ నెల 13న ఆమె ఇంటికి కొందరు బంధువులు వచ్చారు. ఆ ఇంట్లో పని చేస్తున్న పనిమనిషిపై వారి కన్ను పడింది. దీంతో, ఇంటి యజమాని సాయంతో టీలో మత్తు కలిపి బంధువుల్లో ఒకడైన సయ్యద్ హుస్సేన్ అనే వ్యక్తి పనిమనిషిపై అత్యాచారం చేశాడు. దారుణం ఏమిటంటే, ఇంటి యజమాని ఆ దారుణాన్ని వీడియో తీసింది.

దీని తర్వాత డబ్బులు ఇవ్వాలంటూ పనిమనిషిని బెదిరించింది. డబ్బు ఇవ్వకపోతే వీడియోను సోషల్ మీడియాలో పెడతానని హెచ్చరించింది. దీంతో పనిమనిషి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు సయ్యద్ హుస్సేన్ ను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. ఇంటి యజమాని కళావతి గతంలో కూడా ఓ వ్యాపారిని ఇలాగే ట్రాప్ చేసి రూ. 10 లక్షలు డిమాండ్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
Khammam
House Maid
Rape

More Telugu News