Donald Trump: నోబెల్‌ శాంతి బహుమతి రేసులో డొనాల్డ్ ట్రంప్‌!

Trump in Nobel Peace Price Race
  • రేసులో గ్రెటా థన్‌ బర్గ్, డబ్ల్యుహెచ్‌ఓ కూడా
  • కరోనాపై పోరాడుతున్న డబ్ల్యుహెచ్‌ఓ
  • ఆదివారంతో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
ఈ సంవత్సరం నోబెల్‌ శాంతి బహుమతి రేస్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కూడా ఉన్నారు. అవార్డు కోసం నామినేషన్‌ల ప్రక్రియ ఆదివారంతో ముగియగా, ట్రంప్‌ పేరు కూడా కనిపించింది. ట్రంప్‌తో పాటు స్వీడన్‌కు చెందిన 18 ఏళ్ల పర్యావరణ వేత్త గ్రెటా థన్‌ బర్గ్, రష్యా విపక్ష నాయకుడు అలెక్సీ నావల్సీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌ కూడా పోటీ పడుతున్నాయి.

అయితే, గ్రెటా థన్‌ బర్గ్ కు లేదా కరోనాపై పోరాడుతున్న ప్రపంచ దేశాల మధ్య సమన్వయం కోసం కృషి చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఈ అవార్డు లభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. డబ్ల్యుహెచ్‌ఓ కన్నా, అంతర్జాతీయ సదస్సుల్లో పర్యావరణ సంరక్షణపై ప్రసంగిస్తూ, ధైర్యంగా ముందడుగు వేస్తున్న గ్రెటాకు అవార్డును ఇవ్వాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఆమెకు ఎన్నో అంతర్జాతీయ అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే.
Donald Trump
Nobel

More Telugu News