Corona Virus: గత 24 గంటల్లో తెలంగాణలో కరోనాతో ఇద్దరి మృతి
- తాజాగా 17,686 కరోనా టెస్టులు
- 118 మందికి పాజిటివ్
- 264 మందికి కరోనా నయం
- యాక్టివ్ కేసుల సంఖ్య 2,092
- ఐసోలేషన్ లో 723 మంది
తెలంగాణలో తాజాగా కరోనాతో ఇద్దరు మరణించారు. దాంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 1,601 మంది కరోనాతో మృతి చెందారు. గడచిన 24 గంటల్లో 17,686 కరోనా పరీక్షలు నిర్వహించగా, 118 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 264 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇప్పటివరకు మొత్తం 2,94,587 పాజిటివ్ కేసులు నమోదు కాగా 2,90,894 మంది కోలుకున్నారు. తెలంగాణలో కరోనా రికవరీ రేట్ 98.74 శాతం కాగా, జాతీయస్థాయి రికవరీ రేట్ (97 శాతం) అంతకంటే కాస్త తక్కువగానే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,092 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. ఐసోలేషన్ లో ఉన్నవారి సంఖ్య 723గా నమోదైంది.