Varla Ramaiah: ఆ వీడియోలు చూసి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ అవాక్కయ్యారు: వర్ల రామయ్య

SEC shocked after watching those videos says Varla Ramaiah
  • నిమ్మాడ సీఐ పోలీస్ వ్యవస్థకే చీడపురుగు
  • దువ్వాడ బూతులు తిడుతుంటే డీఎస్పీ నవ్వుతూ ఉన్నారు
  • జగన్ బాధ్యతగా వ్యవహరించాలి
శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాళి డీఎస్పీ, నిమ్మాడ సీఐలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కు టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. టీడీపీ సానుభూతిపరులు నామినేషన్లు వేయకుండా వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారికి కొందరు పోలీసు అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిమ్మాడ సీఐ పోలీస్ వ్యవస్థకే చీడపురుగు అని అన్నారు. నిమ్మాడ సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల సమక్షంలోనే దువ్వాడ శ్రీనివాస్ బూతులు తిడుతూ, రెచ్చగొట్టేలా మాట్లాడారని... నరకండి, చంపండి అంటూ రెచ్చగొట్టారని... పక్కనే ఉన్న డీఎస్పీ నవ్వుతూ ఉన్నారని మండిపడ్డారు. ఈ వీడియోలు చూసి ఎస్ఈసీ అవాక్కయ్యారని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. ఎస్ఈసీపై అధికారులను రెచ్చగొట్టవద్దని కోరారు.
Varla Ramaiah
Telugudesam
Jagan
Duvvada Srinivas
Kota Bommali DSP

More Telugu News