రేషన్ అందించే వాహనాలపై రాజకీయ నేతల ఫొటోలు, గుర్తులు వద్దు: హైకోర్టు కీలక ఆదేశాలు
- రేషన్ పంపిణీకి అనుమతి కోరుతూ హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్
- అనుమతించిన హైకోర్టు
- కార్యక్రమ వివరాలతో ఎస్‌ఈసీని సంప్రదించాలని ఆదేశం
ఎన్నికల నిబంధనలకు లోబడి వాహనాల ద్వారా రేషన్‌ను పంపిణీ చేసుకోవచ్చని సూచించింది. అయితే, ఆ వాహనాలపై రాజకీయ నేతల ఫొటోలు కానీ, పార్టీ గుర్తులు, పార్టీ రంగులు కానీ ఉండరాదని ఆదేశించింది. కార్యక్రమ వివరాలతో రెండు రోజుల్లో ఎస్‌ఈసీని సంప్రదించాలని సూచించింది. ఎన్నికల కమిషన్ ఆ తరువాత ఐదు రోజుల్లో తన నిర్ణయం తెలపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.