జనసేన కార్యకర్తల అరెస్టులు గర్హనీయం: నాదెండ్ల మ‌నోహ‌ర్

nadendla manohar slams police
  • క‌ర్నూలు న‌గ‌రంలో చురుకుగా ప‌ని చేస్తోన్న అర్ష‌ద్
  • ఈ నెల 13న జ‌రిగిన ముంపు బాధితుల ధ‌ర్నాలో పాల్గొన్నారు
  • అంద‌రిపై కేసులు బ‌నాయించి, అరెస్టులు చేశారు
  • భ‌య‌భ్రాంతుల‌కు గురైన అర్ష‌ద్ భార్య జ‌హీదా ఆత్మ‌హ‌త్యాయ‌త్నం
జనసేన కార్యకర్తల అరెస్టులు గర్హనీయమంటూ ఆ పార్టీ నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. క‌ర్నూలు న‌గ‌రంలో జ‌న‌సేన పార్టీలో చురుకుగా ప‌ని చేస్తోన్న అర్ష‌ద్ ఈ నెల 13న జ‌రిగిన ముంపు బాధితుల ధ‌ర్నాలో పాల్గొన్నార‌ని ఆయ‌న చెప్పారు.

ఆ ధ‌ర్నాలో అధికారుల‌ను ప్ర‌జా సంఘాల నాయ‌కుడు ప‌రుష ప‌ద‌జాలంతో తిట్టాడ‌ని ఆ కార్యక్ర‌మంలో పాల్గొన్న అంద‌రిపై కేసులు బ‌నాయించి, అరెస్టులు చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అర్ష‌ద్‌ను అరెస్టు చేయాల‌ని ప‌లుసార్లు పోలీసులు అత‌డి ఇంటికి వెళ్ల‌డంతో భ‌య‌భ్రాంతుల‌కు గురైన అర్ష‌ద్ భార్య జ‌హీదా ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశార‌ని చెప్పారు. ఇక‌నైనా పోలీసులు అమాయ‌కుల‌ను వేధించడం మానుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.
 
Go Back to Shorts
Nadendla Manohar
Police
Janasena

More Telugu News