నా ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవు: సీఎస్ కు నిమ్మగడ్డ రమేశ్ లేఖ
- ప్రవీణ్ ప్రకాశ్ ను తొలగించాలని గతంలో సీఎస్ కు సూచించిన నిమ్మగడ్డ
- ఇంత వరకు చర్యలు తీసుకోని ప్రభుత్వం
- కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందన్న నిమ్మగడ్డ
తన ఆదేశాలను అమలు చేయకపోవడం కోర్టు ధిక్కరణ అవుతుందని చెప్పారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్ జరగకుండా చూశానని ప్రవీణ్ ప్రకాశ్ అంగీకరించారని చెప్పారు. ఎన్నికలకు సహకరించని అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ నెల 23న కలెక్టర్లు, ఎస్పీలతో జరగాల్సిన వీడియో కాన్ఫరెన్స్ జరగకుండా ప్రవీణ్ ప్రకాశ్ చేశారని, తన ఆదేశాలను పట్టించుకోలేదని గతంలో సీఎస్ కు నిమ్మగడ్డ లేఖ రాశారు. ఆయనను తక్షణమే విధుల నుంచి తొలగించాలని సూచించారు. తన ఆదేశాలు అమలు కాకపోవడంపై సీఎస్ కు నిమ్మగడ్డ మరోసారి లేఖ రాశారు.