TMC: అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరేందుకు ఢిల్లీ పయనమైన ఐదుగురు టీఎంసీ నేతలు

Five Trinamool Leaders To Be Flown In To Delhi Today To Join BJP
  • శరవేగంగా మారుతున్న బెంగాల్ రాజకీయాలు
  • రేపు హౌరాలో ర్యాలీలో పాల్గొననున్న అమిత్ షా
  • ఈరోజు బీజేపీలో చేరనున్న ఐదుగురు టీఎంసీ నేతలు
పశ్చిమబెంగాల్ లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. మమతాబెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీకి చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరుతున్నారు. రేపు హౌరాలో అమిత్ షా ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టీఎంసీకి చెందిన  ఐదుగురు నేతలు ఢిల్లీకి బయల్దేరారు. వీరంతా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కాషాయ కండువా కప్పుకోనున్నట్టు సమాచారం. వీరంతా ఇప్పటికే టీఎంసీకి గుడ్ బై చెప్పారు.

బీజేపీలో చేరనున్న వారిలో ఎమ్మల్యేలు వైశాలి దాల్మియా, ప్రబిర్ ఘోషల్, హౌరా మేయర్ రతిన్ చక్రవర్తితో పాటు ఒక మాజీ ఎమ్మెల్యే, పౌర సంబంధిత శాఖకు ఐదు సార్లు చీఫ్ గా పని చేసిన రంగనాథ్ పార్థసారథి ఛటర్జీ ఉన్నారు.

మరోవైపు కోల్ కతా నుంచి అమిత్ షా వర్చువల్ మాధ్యమం ద్వారానే ర్యాలీలో పాల్గొంటారని సమాచారం. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో పాటు పలువురు రాష్ట్ర నేతలు మాత్రం ర్యాలీలో పాల్గొంటారు. మరోవైపు నిన్న జరిగిన పార్టీ సమావేశంలో టీఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీని వీడి వెళ్లే నేతల గురించి ఆలోచించకుండా, ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించాలని నిర్ణయించారు.
TMC
Leaders
BJP
Amit Shah

More Telugu News