రూ. 15 లక్షలకు ఏకగ్రీవమైన తూర్పుగోదావరి జిల్లాలోని మురారి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి!
- ఏకగ్రీవాల విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదం
- రాష్ట్రంలో కొనసాగుతున్న వేలం పాటలు
- రూ. 52 లక్షలు పలికిన రాజపూడి సర్పంచ్ పదవి!
ఇక్కడి సర్పంచ్ పదవి ఎస్సీకి రిజర్వు కాగా, వైసీపీ బలపరిచిన అభ్యర్థి గ్రామాభివృద్ధికి రూ. 15 లక్షలు ఇస్తానని చెప్పడంతో గ్రామ పెద్దలు ఏకగ్రీవానికి అంగీకరించినట్టు సమాచారం. అలాగే, జగ్గంపేట మండలంలోని రాజపూడి పంచాయతీ సర్పంచ్ పదవికి వేలం పాట జరగ్గా రూ. 52 లక్షలు పలికినట్టు తెలుస్తోంది. అలాగే, గుర్రంపాలెంలో టీడీపీ, వైసీపీ నేతలు సమావేశమై అధికార పార్టీ అభ్యర్థికి సర్పంచ్ పదవిని అప్పగించాలని నిర్ణయించినట్టు సమాచారం.