Anasuya: మరో సినిమాలో స్పెషల్ సాంగుకి ఓకే చెప్పిన అనసూయ!

Anasuya gives nod for special song in another film
  • కొన్ని సినిమాలలో హీరోయిన్ గా అనసూయ
  • మరికొన్ని సినిమాలలో స్పెషల్ సాంగులు
  • 'చావు కబురు చల్లగా'లో ప్రత్యేక గీతం
  • హీరో హీరోయిన్లుగా కార్తికేయ, లావణ్య    
అనసూయ ఒక్కసారిగా స్పీడు పెంచింది. బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరుతెచ్చుకుని.. తదనంతర కాలంలో సినిమాలలోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ వెండితెరమీద కూడా తనదైన ప్రత్యేకత చాటుతోంది. మంచి కథ, పాత్ర లభిస్తే అటు కొన్ని సినిమాలలో హీరోయిన్ గానూ నటిస్తోంది. అలాగే మరికొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ.. ఇంకొన్ని సినిమాలలో ప్రత్యేక గీతాలలోను నటిస్తూ కెరీర్ ను బిజీగా కొనసాగిస్తోంది. మరోపక్క తమిళంలో విజయ్ సేతుపతి సినిమాలో కూడా నటిస్తోంది.

ఈ క్రమంలో తాజాగా మరో సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయడానికి అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి. కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా 'చావు కబురు చల్లగా' పేరిట ఓ చిత్రం రూపొందుతోంది. ఇందులో ఓ ఐటం సాంగ్ చేయడానికి ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ పాట తమ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందని చిత్ర బృందం భావిస్తోంది. కౌశిక్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ కు చెందిన బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Anasuya
Kartikeya
Lavanya tripathi
Special song

More Telugu News