అందమైన ఫొటోతో శ్రుతిహాసన్ కు బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పిన ప్రియుడు
- శాంతను హజారిక ప్రేమలో ఉన్న శ్రుతి
- నిన్న 35వ పుట్టినరోజు సెలెబ్రేషన్
- ప్రియుడికి థ్యాంక్స్ చెప్పిన ముద్దుగుమ్మ
'నా పుట్టిరోజును మరింత ప్రత్యేకంగా చేసినందుకు ధన్యవాదాలు' అంటూ తన ప్రియుడిని ఉద్దేశించి ఈ ముద్దుగుమ్మ పోస్ట్ పెట్టింది. తన జీవితంలో ఈ ఘడియలు చాలా ముఖ్యమైనవని ఈ సందర్భంగా ఆమె పేర్కొంది. డూడుల్ ఆర్టిస్ట్ గా పేరుగాంచిన శాంతను... గౌహతి ఆర్ట్ ఇనీషియేటివ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా. శ్రుతికి శాంతను సోషల్ మీడియా ద్వారా కూడా గ్రీటింగ్స్ చెప్పాడు. 'హ్యాపీ బర్త్ డే మై లవ్' అంటూ విష్ చేశాడు.