మంచు మోహన్ బాబు కొత్త సినిమా ఫస్ట్‌లుక్ విడుదల!
- మోహన్ బాబు ప్రధానపాత్రలో 'సన్ ఆఫ్ ఇండియా' మూవీ
- దేశభక్తి ప్రధానాంశంగా రూపొందుతున్న సినిమా
- మెడలో రుద్రాక్ష, మాసిన గడ్డం, సీరియస్ లుక్‌తో మోహన్ బాబు
జాతీయ జెండాను పోలిన మూడు రంగుల మీద ఈ సినిమా టైటిల్ ను డిజైన్ చేశారు. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు మంచు విష్ణు నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది.