Acharya: ఇదిగో ధర్మస్థలి ప్రపంచం... ఆచార్య టీజర్ కు ముందు ఆసక్తికర వీడియో

Konidela Pro Company releases a video ahead of Acharya teaser
  • రేపు ఆచార్య టీజర్ రిలీజ్
  • టీజర్ కంటే ముందే మేకింగ్ వీడియో
  • ట్విటర్ లో పంచుకున్న కొణిదెల ప్రొ కంపెనీ
  • ధర్మస్థలికి తలుపులు తెరుచుకుంటున్నాయని వెల్లడి
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రం నుంచి రేపు టీజర్ రిలీజ్ కానుంది. జనవరి 29 సాయంత్రం 4.05 గంటలకు అభిమానులను అలరించేందుకు టీజర్ విడుదల చేయాలని చిత్ర యూనిట్ ముహూర్తం నిర్ణయించింది.

అయితే, టీజర్ కంటే ముందు కొణిదెల ప్రొ కంపెనీ స్వల్ప నిడివి ఉన్న మేకింగ్ వీడియోను పంచుకుంది. ధర్మస్థలి ప్రపంచంలోకి వెళ్లేముందు సంగ్రహావలోకనం అంటూ ట్వీట్ చేసింది. ధర్మస్థలికి రేపు తలుపులు తెరుచుకుంటున్నాయని వెల్లడించింది. ఆచార్య టీజర్ కు మార్గం సిద్ధం చేస్తున్నామంటూ ఈ ట్వీట్ లో పేర్కొన్నారు.

కాగా, చిరంజీవి, కొరటాల శివ కాంబోలో వస్తున్న 'ఆచార్య' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం బాగా బరువుతగ్గిన చిరు స్లిమ్ లుక్ లో పాత మెగాస్టార్ ను జ్ఞప్తికి తెస్తున్నారు. ఆచార్య చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ పోస్టర్ లో చిరంజీవి లుక్ వైరల్ అయింది.
Acharya
Teaser
Video
Konidela Pro Company
Chiranjeevi
Tollywood

More Telugu News