Upasana: కరోనా వ్యాక్సిన్ పై అపోహలు తొలగించేందుకు తానే టీకా తీసుకున్న ఉపాసన

Upasana takes corona vaccine shot to put an end for fears
  • దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్
  • పలు చోట్ల దుష్పరిణామాలు వచ్చినట్టు వార్తలు
  • వెనుకంజ వేస్తున్న ప్రజలు
  • భయాందోళనలు అవసరంలేదన్న ఉపాసన
కరోనా వైరస్ రక్కసిని ఖతం చేసే వ్యాక్సిన్ కోసం ఇన్నాళ్లూ ఎదురుచూసిన ప్రజానీకం... తీరా వ్యాక్సిన్ వచ్చేసరికి సైడ్ ఎఫెక్టుల భయంతో వెనుకంజ వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్లపై నెలకొన్న అపోహలను తొలగించేందుకు మెగా కోడలు ఉపాసన కొణిదెల ముందుకొచ్చారు.

హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో ఇవాళ ఆమె కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. తద్వారా, వ్యాక్సిన్ పై ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరంలేదని, ఇది సురక్షితం అని చాటే ప్రయత్నం చేశారు. ఎలాంటి సంకోచాలు అవసరంలేదని, పౌరులందరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఉపాసన సూచించారు.
Upasana
Vaccine
Corona Virus
Apollo
Hyderabad

More Telugu News