కర్రలు, తల్వార్లతో పోలీసులపై రైతుల దాడి.. 83 మంది పోలీసులకు గాయాలు
- హింసాత్మకంగా మారిన ట్రాక్టర్ల ర్యాలీ
- పగిలిన పోలీసుల తలలు
- భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు
- ర్యాలీలో అసాంఘిక శక్తులు చొరబడ్డాయన్న రైతు నేతలు
పార్లమెంటు, రాష్ట్రపతి భవన్ వద్ద భద్రతను పెంచారు. ఢిల్లీ మెట్రో స్టేషన్లను మూసివేశారు. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. రైతుల ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు. కాగా, తమ ఆందోళనలో అసాంఘిక శక్తులు చొరబడ్డాయని, ర్యాలీ హింసాత్మకంగా మారడానికి అవే కారణమని రైతు సంఘాల ఐక్యవేదిక నాయకుడు రాకేశ్ తికాయత్ ఆరోపించారు.