మదనపల్లె ఘటనలో పద్మజ, పురుషోత్తంనాయుడులకు 14 రోజుల రిమాండ్
- మదనపల్లెలో కుమార్తెలను హత్యచేసిన దంపతులు
- మూఢనమ్మకాలతో ఘాతుకం
- అరెస్ట్ చేసిన పోలీసులు
- ఈ మధ్యాహ్నం కోర్టులో హాజరు
- మదనపల్లె జైలుకు తరలింపు
అంతకుముందు పోలీసుల విచారణలో పద్మజ, పురుషోత్తంనాయుడు ప్రతి ప్రశ్నకు దేవుడు, దయ్యాలతో ముడిపెడుతూ చిత్రవిచిత్రమైన సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది. పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలోనూ నమ్మశక్యం కాని రీతిలో ప్రవర్తిస్తూ తీవ్ర ఆశ్చర్యానికి గురిచేశారు. ఇటీవల ఆ కుటుంబం తమ వీధిలో షికారుకు వెళుతూ పూజ చేసిన నిమ్మకాయలను తొక్కడంతో, ఏదైనా జరుగుతుందేమోనని భయపడడమే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు.