ఢిల్లీలో ఉద్రిక్తత... ఎర్రకోటపైకి భారీగా చేరుకున్న రైతులు
- ఎర్రకోటపై ముగిసిన రిపబ్లిక్ డే వేడుకలు
- దూసుకొచ్చిన రైతులు
- నినాదాలతో మార్మోగుతున్న ఎర్రకోట పరిసరాలు
- ఎక్కడ చూసినా ట్రాక్టర్లు, రైతులు
కేంద్ర వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు గణతంత్ర పరేడ్ పేరిట నేడు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎర్రకోట పరిసరాల్లో ఎక్కడ చూసినా ట్రాక్టర్లు, వాటిపై రైతులే దర్శనమిస్తున్నారు. అంతకుముందు ఢిల్లీ ఐటీవో వద్ద పోలీసులకు, రైతులకు మధ్య ఘర్షణలు జరిగాయి. అయితే ట్రాక్టర్లతో దూసుకొచ్చిన రైతుల ధాటికి పోలీసులు వెనుకంజ వేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే రైతులు పెద్ద సంఖ్యలో ఐటీవో నుంచి ఎర్రకోట చేరుకున్నట్టు అర్థమవుతోంది.