'జై శ్రీరామ్' నినాదాలు చేసి నేతాజీని అవమానించారు: మమతా బెనర్జీ
- బీజేపీపై ధ్వజమెత్తిన మమత
- భారత్ ను మండించే పార్టీ అంటూ వ్యాఖ్యలు
- ప్రధాని ముందే తనకు అవమానం జరిగిందన్న మమత
- బీజేపీ సంస్కృతి అదేనంటూ విమర్శలు
"ఎవరినైనా మీరు ఇంటికి ఆహ్వానించి అవమానిస్తారా? ఇది బెంగాల్ సంస్కృతి, లేక దేశ సంస్కృతి అనిపించుకుంటుందా? నేతాజీని స్తుతిస్తూ నినాదాలు చేస్తే నాకెలాంటి సమస్య ఉండదు, కానీ వాళ్లు అలా చేయలేదు. నన్ను రెచ్చగొట్టేందుకు ఈ కార్యక్రమంతో సంబంధంలేని నినాదాలు చేశారు. దేశ ప్రధాని ముందు నేను తీవ్ర అవమానానికి గురయ్యాను. అదే వారి సంస్కృతి" అని వ్యాఖ్యానించారు. పుర్సురాలో జరిగిన ఓ సభలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు.