ప్రధాని మోదీ ఈ పుస్తకం చదివితే తప్పకుండా తమిళ భాషను, సంస్కృతిని గౌరవిస్తారు: రాహుల్ గాంధీ
- తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ ప్రచారం
- నేడు కరూర్ లో ప్రసంగం
- తాను 'తిరుక్కురాళ్' పుస్తకం చదువుతున్నట్టు వెల్లడి
- తమిళులను అర్ధం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు వివరణ
"మీరు (తమిళులు) ఎంత బలహీనులైనా కావచ్చు కానీ, ఎలాంటి పరిస్థితుల్లోనూ హుందాతనాన్ని, ఆత్మాభిమానాన్ని, తమిళ స్ఫూర్తిని మాత్రం మీరు కోల్పోరు. నేను కూడా ఇప్పుడు తమిళ స్ఫూర్తి అంటే ఏమిటి? అనేది తెలుసుకుంటున్నాను. అందుకే 'తిరుక్కురాళ్' పుస్తకాన్ని చదవడం ప్రారంభించాను. ఈ సానుకూల దృక్పథం, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం కొత్తేమీ కాదు, అవి మీ భాష, సంస్కృతిలోనే అంతర్లీనంగా కదలాడుతుంటాయి" అని వివరించారు.
ఒకవేళ ప్రధాని మోదీ గనుక 'తిరుక్కురాళ్' పుస్తకాన్ని చదివితే మాత్రం తప్పకుండా తమిళ భాషను, తమిళ ప్రజల సంస్కృతిని అర్థం చేసుకుంటారని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.