sikkim: భార‌త్-చైనా సైనికుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌.. 20 మంది చైనా సైనికుల‌కు గాయాలు

Indian Army Foils Chinas Attempt To Enter Sikkim
షార్ట్స్‌లో చూడండి
ఓ వైపు చ‌ర్చ‌లు జరుపుతూనే మ‌రోవైపు స‌రిహ‌ద్దుల వ‌ద్ద బ‌ల‌గాల‌ను పెంచుతోన్న చైనా దుందుడుకు చ‌ర్య‌లకు పాల్ప‌డుతూనే ఉంది. మ‌రోసారి స‌రిహ‌ద్దులు దాటి భార‌త్‌లోకి ప్ర‌వేశించేందుకు చైనా సైనికులు ప్ర‌య‌త్నించారు. గతవారం జ‌రిగిన ఈ ఘ‌ట‌న గురించి మీడియాకు ఆల‌స్యంగా స‌మాచారం అందింది.

చైనా సైనికుల చొర‌బాటును గుర్తించిన‌ భార‌త జ‌వాన్లు వెంట‌నే స్పందించి, దీటుగా వారి ప్ర‌య‌త్నాల‌ను  తిప్పికొట్టారు. ఉత్త‌ర‌ సిక్కింలోని నాకూ లాలో స‌రిహద్దుల వ‌ద్ద ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. భార‌త జ‌వాన్ల ధాటికి 20 మంది చైనా సైనికులు గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం.

అలాగే, న‌లుగురు భార‌త జ‌వాన్లకూ గాయాల‌యిన‌ట్లు తెలిసింది. దీంతో ఆ  ప్రాంతంలో  ఉద్రిక్త‌ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. సిక్కింలోని ఇదే ప్రాంతంలో 2020, మే9న కూడా  చైనా దుందుడుకు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌గా భార‌త సైన్యం వారిని త‌రిమికొట్టింది. అప్ప‌ట్లోనూ ఇరు దేశాల సైనికులు గాయ‌ప‌డ్డారు.
Go Back to Shorts
sikkim
India
China
army

More Telugu News