ఆన్ లైన్లో నకిలీ షాపింగ్ వెబ్ సైట్లు ఇవిగో... గుట్టురట్టు చేసిన ముంబయి పోలీసులు
- గుజరాత్ లో ఐటీ నిపుణుడి అరెస్ట్
- రూ.70 లక్షలకు పైగా స్వాహా చేసినట్టు గుర్తింపు
- 22 వేల మందికి పైగా బాధితులు
- ఆన్ లైన్ మోసాలపై హెచ్చరిక చేసిన ముంబయి పోలీసులు
ఈ నకిలీ షాపింగ్ వెబ్ సైట్లతో 22 వేల మందికి పైగా మోసపోయినట్టు తేలింది. ముంబయి పోలీసులు ఈ మేరకు ట్విట్టర్ లో ఆయా నకిలీ షాపింగ్ వెబ్ సైట్ల జాబితాను కూడా పంచుకున్నారు. డిస్కౌంట్ల కోసం వెంపర్లాడితే అవి మీ బ్యాంకు అకౌంట్లను వెంటాడతాయని ముంబయి పోలీసులు హెచ్చరించారు.