విదేశీ, స్వదేశీ శత్రువుల నుంచి అమెరికా రాజ్యాంగాన్ని కాపాడతా: కమలా హారిస్
- కమలా దేవి హారిస్ అను నేను.. అంటూ ప్రమాణ స్వీకారం
- భగవంతుడా, నాకు సహకరించు అని వేడుకోలు
- నల్లజాతి డిజైనర్లు రూపొందించిన దుస్తుల్లో మెరిసిన కమల
- నల్ల జాతి మహిళల ఫొటోలతో తొలి ట్వీట్
అనంతరం అధికారిక ట్విట్టర్ ద్వారా తొలి ట్వీట్ చేశారు. తానీరోజు ఈ పదవిలో ఉన్నానంటే అందుకు ఇంత వరకు ముందడుగు వేసిన మహిళలే కారణమని అన్నారు. తాను ఎల్లప్పుడూ ప్రజలకు సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన ట్వీట్‌కు తన తల్లి శ్యామల, పలువురు నల్లజాతి మహిళల ఫొటోలను జత చేశారు. నల్లజాతి డిజైనర్లు క్రిస్టఫర్ జాన్ రోగర్స్, సెర్గియో హడ్సన్‌లు రూపొందించిన ఊదారంగు దుస్తులు ధరించి ‘కమలాదేవి హారిస్ అను నేను..’ అంటూ ప్రమాణస్వీకారం చేశారు.