ఏపీ కరోనా అప్ డేట్: 161 కొత్త కేసులు, 1 మరణం

ఏపీలో గడచిన 24 గంటల్లో 36,091 కరోనా పరీక్షలు నిర్వహించగా 161 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 52 కేసులు గుర్తించారు. కృష్ణా జిల్లాలో 26, గుంటూరు జిల్లాలో 19, శ్రీకాకుళం జిల్లాలో 12 కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. నెల్లూరు జిల్లాలో 3, విజయనగరం జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 5, ప్రకాశం జిల్లాలో 5, కర్నూలు జిల్లాలో 6 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 251 మంది కోలుకోగా, విశాఖపట్నంలో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,85,985కి పెరిగింది. 8,76,949 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,896 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 7,140కి చేరింది.

Andhra Pradesh
Corona Virus
Update
Positive Cases
Deaths
Active Cases

More Telugu News