Maharashtra: ‘మహా’ మంత్రి ధనుంజయ్ ముండేపై వస్తున్న లైంగిక ఆరోపణలపై శరద్ పవార్ స్పందన

will discuss and take action Sharad Pawar about Dhanunjay Munde
  • మంత్రి గత కొంతకాలంగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నారంటూ మహిళ ఫిర్యాదు
  • తీవ్రంగా స్పందించిన శరద్ పవార్
  • పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న ఎన్సీపీ అధినేత
మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత ధనుంజయ్ ముండేపై వచ్చిన లైంగిక ఆరోపణలపై ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు.  ధనుంజయ్‌పై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని, ఈ విషయాన్ని పార్టీ చర్చిస్తుందని పేర్కొన్నారు. పార్టీ నేతలతో చర్చించిన అనంతరం ఈ విషయమై ఓ నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై గత కొన్నేళ్లుగా మంత్రి అత్యాచారానికి పాల్పడుతున్నారంటూ ఇటీవల ఓ మహిళ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలీవుడ్‌లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మబలికి తనను లొంగదీసుకున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ధనుంజయ్ నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు.

అయితే, లైంగిక ఆరోపణలను ఖండించిన మంత్రి.. ఆమెతో రిలేషన్‌షిప్ ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. కుటుంబ సభ్యులకు కూడా తమ రిలేషన్‌షిప్ గురించి తెలుసని పేర్కొన్నారు. మంత్రిపై వచ్చిన ఆరోపణలతో దుమారం రేగడంతో స్పందించిన శరద్ పవార్ ఈ విషయంలో త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Maharashtra
Dhanunjay Munde
Sharad Pawar
NCP

More Telugu News