మరో సినిమాకి అనుష్క గ్రీన్ సిగ్నల్?
- ఇటీవలి కాలంలో వెనుకపడిన అనుష్క
- నిరాశపరిచిన తాజా చిత్రం 'నిశ్శబ్దం'
- 'రారా కృష్ణయ్య' ఫేమ్ మహేశ్ తో సినిమా
ఈ నేపథ్యంలో, అనుష్క తాజాగా ఓ తెలుగు సినిమాకి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో 'రారా కృష్ణయ్య' చిత్రాన్ని రూపొందించిన పి.మహేశ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మహేశ్ చెప్పిన కథ నచ్చడంతో, ఆమె ఈ ప్రాజక్టుకి ఓకే చెప్పిందని అంటున్నారు. ఈ ప్రాజక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడవచ్చని అంటున్నారు.